News
పీవీ సింధుకు భారీ నజరానా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు భారీ నజరానా ప్రకటించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధూను తగిన రీతిలో గౌరవించాలని నిర్ణయించిన ఏపీ కేబినెట్ సింధును అభినందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సింధుకూ రూ.కోట్ల నగదు బహుమతితో పాటు రాజధానిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే సింధును ఒలింపిక్స్ స్థాయిలో తీసుకెళ్లిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే ఏపీలో గోపీచంద్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చేలా ప్రతిపాదించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సింధు తండ్రి రమణకు లేఖ రూపంలో అందజేయాలని నిర్ణయించారు. సింధు ఇండియాకు వచ్చిన వెంటనే విజయవాడలో సన్మాన సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ నజరానాను ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








